ప్రాంతాలు లేదా వాతావరణ హ్యాండిల్స్ లో కొన్ని “న్యూట్రల్” రకాల గురించి నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. ఒక మొదట ఆ హేండిల్ కి తగ్గ ట్వీట్స్ వేస్తూ క్రమంగా ఎంగేజ్మెంట్ పెంచుకుంటారు.. ఉదాహరణకు ప్రాంతాలవి ఐతే ఆయా ప్రాంతాల ఆహార, భాష, పురాతన, వర్తమాన విషయాలు పంచుకుంటూ.. ఫోటోలు, ప్రశ్నలు వగైరా ఎక్కువ ఆకట్టుకునే విషయాలని షేర్ చేస్తూ అలా క్రమంగా వాటి ఎంగేజ్మెంట్, వ్యూయర్షిప్ పెంచుకుంటారు.

వ్యూయర్షిప్ ఎందుకు పెరుగుతుందంటే, సహజంగా రాజకీయాలకి పడనివారు, దూరంగా ఉండాలని అనుకున్నవారు కూడా వాటిని ఫాలో అవుతారు. అలాగే ప్రాంతాన్ని బట్టి అన్ని రాజకీయ భావాలుగల వాళ్ళుకూడా ఫాలో అవుతారు. క్రమంగా కొంత మంచి వ్యూయర్షిప్ వచ్చాక ఆ హేండిల్ కి కొంత క్రెడిబిలిటీ వచ్చిందనుకున్న తర్వాత, నెమ్మదిగా కొన్ని రాజకీయ ట్వీట్స్ వదులుతారు.. ఆబ్బె మేము చాలా న్యూట్రల్, కానీ ఇది మా ప్రాంతాన్ని బాధించింది, మనోభావాలు అని అలా మొదలవుతుంది. నేను గమనించిన వాటిలో చాలా వరకు ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు సపోర్ట్ చేసేలా ఆ రాజకీయ ట్వీట్స్ అన్నమాట. ఇక్కడ చమత్కారం ఏంటంటే అది ఎప్పుడూ ప్రభుత్వంలో ఉన్నవాళ్లకు సపోర్ట్ చేసేవి కాదు 2019 కి ముందు ప్రతిపక్షానికి సపోర్ట్ చేసేవి.. సో సమస్యేంటో ఇప్పుడు ఒక అవగాహనకి వచ్చివుంటారు.. సహజంగా ఒకవైపే ట్వీట్స్ వున్నప్పుడు అవతలివాళ్ళు తిరగబడతారు.. ఇంకా ముసుగేసుకుని, ఛ చ్చ మెం చాలా న్యూట్రల్ అంటే ఎబ్బెట్టుగానే కాదు, ఒక అజెండాతో పనిచేస్తున్నారని అర్ధం అవ్వాలి..

ఇక్కడ వీళ్ళలో రెండు రకాలు. ఒకళ్ళు నిజంగా తమ హేండిల్ ద్వారా అలాంటివే చేద్దామని మొదలుపెట్టినవి, మరొకళ్ళు కొన్ని సంస్థల ద్వారా రూపుదిద్దుకున్నవి.

మొదటి రకం వాళ్ళని ఒక క్రెడిబిలిటీ క్రియేట్ అయ్యాక కొన్ని సంస్థలు సంప్రదించి వాళ్ళ బిజినెస్ మోడల్లో వాళ్ళని భాగస్వామి చేస్తారు.. ఒక రకంగా చెప్పాలంటే ఇంస్టా ఇన్ఫ్లుఎంసెర్స్ లా పోస్టుకి తగ్గ పేమెంట్ అని లేదా ఆ హేండిల్ మొత్తాన్ని వాళ్లకి అమ్మటం కానీ.. కొన్ని పేరొందిన ఫ్యాన్ హ్యాండిల్స్ కూడా ఈరకంగా వాడుకున్న దాఖలాలు ఉన్నాయి. ఈమధ్యకాలంలో అలాంటివి ఫ్యాన్ వార్లు రాజేస్తున్నాయి..

రెండవరకం, నేరుగా ఆయా సంస్థ క్యూరేట్ చేసి వేసెవి..

ఆ వ్యక్తులకి ఆ హేండిల్ మొదలుపెట్టిన వాళ్లకి ఎలాంటి భావాలున్నా, ఒకసారి ఆ పేరోల్లోకి వెళ్ళాకా తప్పని పరిస్థితి. ఫక్తు యాపారం. వీళ్ళు చేసేదంతా వాళ్ళ ఫాలోయర్స్ లోకి ఒక సబ్కాన్షియస్ ఆలోచనని పడేయటం. తద్వారా నిజమైన న్యూట్రల్స్ ని వాళ్ళ వైపు/వాళ్ళ పే మాస్టర్ వైపు తిప్పుకోవడానికి మాత్రమే.. ఒక నిర్ధేశిత లక్ష్యంతో చేసేవే.

ఇక్కడ ఇంకోవిషయం చెప్పుకోవాలి, రాజకీయ భావాలకు సపోర్ట్ చేసే సోషల్ “మీడియా” హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.. ఉదాహరణకు ఒకవైపు GA కావచ్చు లేదా మరోవైపు Mirchi కావచ్చు..అలాంటి “మీడియా” హ్యాండిల్స్ మరికొన్ని కావొచ్చు. వాటిమీదకూడా అవతలి వాళ్ళు గట్టిగానే ట్రోల్ చేస్తారు.. వాళ్ళు పెట్టె ప్రతీ పోస్టులో వాళ్ళని విమర్శించేవి చాలా ఉంటాయి..
కానీ వాళ్ళు ఇలా న్యూట్రల్ ముసుగులో గుక్కెట్టి ఏడవరు.. ఓపెన్ గా వాళ్ళు చేసేవి చేస్తుంటారు.. మేము న్యూట్రల్ మమ్మల్ని అంటం తప్పు అని ఏనాడు చూసిందిలేదు.. సోకాల్డ్ “న్యూట్రల్” ఇన్ఫ్లుఎంసెర్స్ సమస్యల్లా వాళ్ళ క్రెడిబిలిటీ పడిపోతాంది అన్న బాధ తప్ప మరొకటి కాదు.

ఇంకొంతమంది సూడో న్యూట్రల్స్ గురించి చెప్పాలంటే కొంతమంది రాజకీయ నాయకులమీద వ్యతిరేకత వలన వాళ్లనే ఎక్కువ విమర్శిస్తుంటారు.. అది ఎవరైనా గమనించి చెప్తే నేను వేరేవాళ్ళనికూడా అన్నాను కావాలంటే చూస్కోండి అంటారు.. ఇక్కడ చిత్రం ఏంటంటే మొన్న JP గురించి ఒక మాట అన్నాను.. అదిక్కడ వర్తిస్తుంది. నచ్చినోడిని తమలపాకులతో కొట్టి, నచ్చనోడిని కొబ్బరిమట్టలతో కొట్టి.. ఆబ్బె నేను ఎవర్నైనా ఆకుతోనే కొడతానంటే న్యూట్రల్ అని ఎలా అనగలరు?

విమర్శ తప్పని అనను ఓపెన్ గా చేస్తే ఇష్టమైతే ఫాలో అవుతారు లేదా అవ్వరు.. ఇలా ముసుగులో చేసినప్పుడే సమస్య. అసలు నిజంగా న్యూట్రల్స్ ఉంటారా అంటే నా అభిప్రాయం కచ్చితంగా ఉంటారు.. వాళ్ళే ఎన్నికలని శాసించేది. వచ్చే 5ఏళ్ళు ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళని ఎన్నుకుంటారు. తప్పొప్పుల్ని ఒకరివైపే కాదు, ఇద్దరివైపు చూపగలరు. కొడితే ఇద్దరినీ ఒకే ఆకుతో కొడతారు. వాళ్ళని గెలుచుకునేందుకు వేసే వేషాలే ఈ ప్రాంతాల, వాతావరణ విన్యాసాలు.

గమనిక: నేనస్సలు న్యూట్రల్ కాదు! If we are no saints, we don’t need to act like one.

శుభం!