ట్విట్టర్ లో న్యూట్రల్ అని చెప్పుకునే కొన్ని ప్రాంతాల, వాతావరణ హ్యాండిల్స్ గురించి
ప్రాంతాలు లేదా వాతావరణ హ్యాండిల్స్ లో కొన్ని “న్యూట్రల్” రకాల గురించి నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. ఒక మొదట ఆ హేండిల్ కి తగ్గ ట్వీట్స్ వేస్తూ క్రమంగా ఎంగేజ్మెంట్ పెంచుకుంటారు.. ఉదాహరణకు ప్రాంతాలవి ఐతే ఆయా ప్రాంతాల ఆహార, భాష, పురాతన, వర్తమాన విషయాలు పంచుకుంటూ.. ఫోటోలు, ప్రశ్నలు వగైరా ఎక్కువ ఆకట్టుకునే విషయాలని షేర్ చేస్తూ అలా క్రమంగా వాటి ఎంగేజ్మెంట్, వ్యూయర్షిప్ పెంచుకుంటారు. వ్యూయర్షిప్ ఎందుకు పెరుగుతుందంటే, సహజంగా రాజకీయాలకి పడనివారు, దూరంగా ఉండాలని అనుకున్నవారు కూడా వాటిని ఫాలో అవుతారు. అలాగే ప్రాంతాన్ని బట్టి అన్ని రాజకీయ భావాలుగల వాళ్ళుకూడా ఫాలో అవుతారు....